కామారెడ్డి జిల్లాలో మళ్ళీ కల్తీ కల్లు కలకలం.. 110 మందికి పైగా బాధితులు

కామారెడ్డి జిల్లాలో మళ్ళీ కల్తీ కల్లు కలకలం.. 110 మందికి పైగా బాధితులు

కామారెడ్డి జిల్లాలో మళ్ళీ కల్తీ కళ్ళు కలకలం రేపింది. వరుసగా రెండో రోజు కల్తీ కల్లు తాగి జనం అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ( ఏప్రిల్ 8 ) కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని గౌరారం గ్రామంలో కుస్తీ పోటీల సందర్భంగా కల్తీ కల్లు తాగి 30మంది అస్వస్థతకు గురి కాగా.. ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధితులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. కల్తీ కల్లు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

కామారెడ్డి జిల్లాలో వరుసగా కల్తీ కల్లు ఘటనలు చోటు చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కాసుల కక్కుర్తితో కల్తీ కల్లు అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కల్లు దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.

కామారెడ్డి జిల్లాలో రెండురోజులుగా చోటు చేసుకున్న వరుస కల్తీ కల్లు ఘటనల్లో మొత్తం బాధితుల సంఖ్య 110 మందికి పైగానే ఉన్నట్లు సమాచారం.