ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్లు..స్వచ్ఛ భారత్ మిషన్ కింద 34,023 మందికి మంజూరు

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మరుగుదొడ్లు..స్వచ్ఛ భారత్ మిషన్ కింద 34,023 మందికి మంజూరు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుండటంతో  34,023 మంది లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) డైరెక్టర్​ బుధవారం కలెక్టర్లను ఆదేశించారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద మొదటి విడతలో 9,925 మందికి, రెండో విడతలో 24,098 మందికి  మొత్తం 34,023 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తారు.

 ఒక్కో దాని నిర్మాణానికి రూ.12 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌బీఎం(జీ) మిషన్ డైరెక్టర్ గుమ్మళ్ల సృజన అన్ని జిల్లాల కలెక్టర్లకు (హైదరాబాద్, మేడ్చల్ సహా) ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల జాబితా (జాబ్ కార్డు, ఇందిరమ్మ ఐడీతో)ను వెంటనే స్​బీఎం-ఐఎంఐఎస్​ పోర్టల్‌‌‌‌లో నమోదు చేయాలని,ఇండ్లతో పాటు మరుగుదొడ్లు కూడా అందుబాటులోకి రావాలని సూచించారు. మంజూరు పూర్తయిన వెంటనే ఎస్సీ, ఎస్టీ, జనరల్ కేటగిరీల వారీగా బిల్లులను యుద్ధప్రాతిపదికన చెల్లించాలని స్పష్టం చేశారు.