
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఓ రేషన్ డీలర్ లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేశాడు. ఏసీసీ ఏరియాలోని 15వ నెంబర్ రేషన్ దుకాణంలో డీలర్ వెంకటస్వామి.. కర్ఫ్యూ టైమ్‌లో రేషన్ టోకెన్లు పంపిణీ చేశారు. దాంతో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా టోకెన్ల కోసం లబ్దిదారులు భారీ సంఖ్యలో వచ్చారు. ఉదయం 5 గంటల నుంచే టోకెన్ ఉన్నవారికి రేషన్ బియ్యం ఇస్తుండటంతో.. అర్ధరాత్రి ఒంటి గంటకే జనాలు టోకెన్ల కోసం క్యూ కట్టారు. రేషన్ షాప్ దగ్గర భౌతిక దూరం పాటించకుండా జనం గుంపులు గుంపులుగా చేరారు. దాంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ రూల్స్ బ్రేక్ చేసిన రేషన్ డీలర్ వెంకటస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.