
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హిట్ చిత్రాల్లో ‘తొలిప్రేమ’కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎ.కరుణాకరన్ దర్శకత్వంలో జి.వి.జి.రాజు నిర్మించిన ఈ చిత్రం విడుదలై ఈ ఏడాదితో ఇరవై ఐదేళ్లు పూర్తవుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.
4 కె క్వాలిటీతో 300కి పైగా థియేటర్స్‌లో జూన్ 30న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. శనివారం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాతలు దిల్ రాజు, వివేక్ కూచిభొట్ల, దర్శకుడు కరుణాకరన్, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, నటి వాసుకి అతిథులుగా హాజరై అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని జనసేన పార్టీ నిర్వహిస్తున్న రైతు భరోసా యాత్రకు విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రఘురాం రెడ్డి, రవికాంత్ రెడ్డి తెలియజేశారు.