Toll Plaza Charges : టోల్ ఛార్జీలు పెరిగినయ్.. ఏప్రిల్ నుంచే కొత్త బాదుడు

Toll Plaza Charges : టోల్ ఛార్జీలు పెరిగినయ్.. ఏప్రిల్ నుంచే కొత్త బాదుడు

భారత్ లో ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరల భారీగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భాగంగానే నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో సామాన్యుడి జీవితం పెను భారం పడుతోంది. ఇదిలా ఉండగానే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్ హెచ్ఏఐ) ఒక షాకింగ్ న్యూస్ ప్రకటించింది. టోల్ చార్జీలు పెంచాలని నిర్ణయం తీసుకుంది.

ఈ పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో టోల్ ఛార్జీలను సమీక్షిస్తారు. అందులో భాగంగానే ఈ ఏడాది 5 నుంచి 10 శాతం వరకు ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్ హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న టోల్ ప్లాజాల్లో ఏప్రిల్ 1 నుంచి పెరిగిన ఛార్జీలు అమలవుతాయి. జాతీయ రహదారులపై తిరిగే అన్ని రకాల వాహనాల (బైక్ మినహా) టారిఫ్ ధరలను 10 రూపాయల నుండి 60 రూపాయల వరకు పెంచారు.