
హైదరాబాద్: మహాత్మా గాంధీపై టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ భరత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గాంధీ మహాత్ముడా? జాతిపితనా? అంటూ రాయడానికి వీల్లేని భాషలో దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియోని స్వయంగా ఆయనే ఎక్స్లో షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది. అందులో గాంధీజీ స్త్రీలోలుడని, ఏంతో మంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని ఆరోపించాడు.
'నమస్కారం. నేను శ్రీకాంత్ భరత్. నేను ఏ పోస్టు పెట్టినా కామెంట్స్ బాగా వస్తున్నాయి. అయినా నేను పెద్దగా పట్టించుకోను. కానీ అక్టోబర్ 2న ఓ పోస్టు పెడితే.. చాలా బూతులు తిట్టారు. నేను కామెంట్ చేసిన వ్యక్తి గురించి మీకు ఏం తెలుసురా? అంటూ శ్రీకాంత్ భరత్ రెచ్చిపోయారు. గాంధీజీ జాతిపిత అయితే తాను సిటిజన్ ఆఫ్ బాస్టర్డ్ అంటూ' ధైర్యం ఉంటే ఈ వీడియో చూడండి.. ఇది నిజం' అని ఎక్స్లో రాసుకొచ్చాడు.