ఐపీఎస్తో నటి డింపుల్ వివాదం.. అసలేం జరిగిందంటే?

ఐపీఎస్తో నటి డింపుల్  వివాదం.. అసలేం జరిగిందంటే?

నటి డింపుల్ హయతీ, ఐపీఎస్ అధికారి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డేకు మధ్య వివాదం తారాస్థాయికి చేరింది.  డింపుల్ హయతిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో క్రిమినల్ కేసు నమోదు కావడంతో వివాదం చర్చనీయాంశంగా మారింది. మరో వైపు అధికారాన్ని అడ్డం పెట్టుకుని  తప్పును కప్పిపుచ్చుకోలేరంటూ డింపుల్ ట్వీట్ చేయడంతో ఈ వివాదం మరింత ముదురుతోంది.

ఇదే వివాదంపై స్పందించిన  ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే ..  డింపుల్ హయతితో తనకు పర్సనల్ గా ఎలాంటి గొడవ లేదని చెప్పారు.  గత కొన్నిరోజులుగా డింపుల్ హయతి కార్ ని తన కారుకి అడ్డంగా పెడుతుందని ఆరోపించారు. తన డ్రైవర్ చెప్పినా వినకుండా రిపీట్ చేశారన్నారు. తన కారును తన్ని ఢీ కొట్టిందని చెప్పారు.  తన డ్రైవర్ చట్టం ప్రకారం జూబ్లీహిల్స్ పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చాడని.. పోలీసులు విచారణ చేస్తున్నారని వెల్లడించారు .సీసీ ఫుటేజీలో కూడా డింపుల్ హయతి కారును కాలుతో తన్ని ఢీ కొట్టినట్టు ఉందన్నారు.  ఆమె కారుపై చలాన్లు ఉన్నట్లు తనకు తెల్వదన్నారు డీసీపీ రాహుల్. 

డింపుల్ హయతి కారుపై 3 వేలకు పైగా చలాన్లు

డీసీపీ రాహుల్ హెగ్గే కారును ఢీ కొట్టిన డింపుల్ హయతి కారు డేవిడ్ అనే వ్యక్తి  పేరుతో ఉంది.  ఈ కారుపై గత వారం  రోజులుగా చలాన్లు పడుతున్నాయి. మే 15 , 20, 21 న చలాన్లు ఉన్నాయి.  20 వ తేదీ రాంగ్ సైడ్ పార్కింగ్, డేంజరస్ డ్రైవింగ్, నిబంధనలను ఉల్లంఘించిన వాటి పై జరిమానా ఉన్నాయి.  21వ తేదీన ఫ్యాన్సీ నెంబర్ ప్లేట్ ఉందని ఛలానాతో పాటు నిబంధనలు పాటించడం లేదంటూ మరో చలాన్  ఉంది. ఇలా ఆ కారుపై  3 వేల రూపాయలుకు పైగా ఛలాన్లు ఉన్నాయి. 

ఒకే అపార్ట్ మెంట్ లో డింపుల్, ట్రాఫిక్ డీసీపీ

జర్నలిస్ట్ కాలనీలో ఒకే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నారు డింపుల్ హయతి,  డీసీపీ రాహుల్ హెగ్డే.  అయితే పార్క్ చేసిన రాహుల్ కారును డింపుల్ హయతి కాలితో తన్నడంతో పాటుగా ఆమె ఫ్రెండ్ డేవిడ్ తో కలిసి  ఢీ కొట్టిందని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.   రాహుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కింద డింపుల్‌పై 353, 341, 279 సెక్షన్‌ల కింద పోలీసులు  కేసు నమోదు చేశారు.  ఇప్పుడే కాకుండా  డింపుల్ ఇంతకు ముందు కూడా ఇలాగే ప్రవర్తించిందని రాహుల్ తన  ఫిర్యాదులో తెలిపారు. నచ్చజెప్పేందుకు పలుమార్లు ఫయత్నించినా కూడా ఆమె తీరు మార్చుకోలేదట. దీంతో ఫిర్యాదు చేసినట్టుగా రాహుల్  వెల్లడించారు. దీంతో డింపుల్ తో పాటుగా డేవిడ్ ను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు  పోలీసులు.   ఇద్దర్ని ఈ విషయంలో హెచ్చరించి CRPC 41a కింద నోటీసులు ఇచ్చి, మరోసారి విచారణకు అవసరమైతే రావాలని చెప్పి పంపించారు. ఇక  ఖిలాడి, రామబాణం చిత్రాలతో డింపుల్ హయతి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.