వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న టాలీవుడ్ డైరెక్టర్ ఆర్. ఆర్ మదన్

వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న టాలీవుడ్ డైరెక్టర్ ఆర్. ఆర్ మదన్

టాలీవుడ్ దర్శకుడు ఆర్. ఆర్ మదన్ ఆరోగ్యం విషమంగా ఉంది. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్కు గురైన మదన్ను కుటుంబ సభ్యులు..అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.  మదన్ వెంటిలేటర్ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

ఏపీ చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన మదన్..తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వర్సిటీలో చదువుకున్నారు.  కాలేజీ రోజుల్లోనే నాటకాలు వేశారు. ఆ  తర్వాత సినిమాల మీద ఇష్టంతో హైదరాబాద్ కు వచ్చిన ఆయన...ఎస్ గోపాల్ రెడ్డి దగ్గర అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేశారు. కొన్ని సినిమాలకు అసిస్టెంట్ రైటర్గా వ్యవహరించారు. తొలిసారిగా ఆ నలుగురు  సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించారు. ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో  సినిమాతో డైరెక్టర్గా మారారు.  గుండె ఝల్లుమంది, ప్రవరాఖ్యుడు, కాఫీ విత్ మై వైఫ్, గరం, గాయత్రి వంటి సినిమాలకు దర్శకుడిగా వ్యవహరించారు. చివరగా మదన్ మోహన్ బాబుతో గాయత్రి మూవీని డైరెక్ట్ చేశారు.