
ఈమధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇందులో ముఖ్యంగా క్యాస్ట్ & క్రూ సెలెక్షన్ నుంచి మేకింగ్ వరకూ కొత్తకొత్త టెక్నాలజీ పద్దతులను ఉపయోగిస్తున్నారు.అయితే హీరోల విషయానికొస్తే ఈ మధ్యకాలంలో యాక్షన్ సీక్వెన్స్ లో ఎక్కువగా డూప్ లని ఉపయోగిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బైక్ స్టంట్స్, ఫైట్స్ వంటివాటితో బాడీ డబుల్స్ ని వాడుతున్నారు.
అయితే బాడీ డబుల్ ని ఉపయోగించే వారిలో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తదితర స్టార్ హీరోలు ఉన్నారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ తదితరులు కూడా డూప్ లని ఉపయోగించేవారు. ఇక బాలీవుడ్ లో కూడా కండలవీరుడు సల్మాన్ ఖాన్ , షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ తదితరులు సినిమా షూటింగ్స్ లో బాడీ డబుల్స్ ని ఉపయోగిస్తున్నారు. అయితే ఒకప్పుడు షూటింగ్స్ లో దాదాపుగా 70శాతం సన్నివేశాలు హీరోలే చేసేవారు.. కానీ ఈ మధ్య కాలంలో స్టార్ హీరోలు ఎక్కువగా బాడీ డబుల్ పై ఆధారపడాల్సి వస్తోంది.
ALSO READ : SVSCReRelease: క్రేజీ.. క్రేజీ.. క్రేజీ.. అక్షింతలతో, డ్యాన్సులతో ఫ్యాన్స్ కుమ్మేస్తున్నారు.. వీడియోలు వైరల్
అంతేకాదు షూటింగ్ పూర్తయ్యేసరికి దాదాపుగా 60% శాతానికి పైగా డూప్ పాత్ర ఉంటోంది. దీంతో ఓ మీడియం రేంజ్ హీరోకి ఇస్తున్న రెమ్యునరేషన్ స్టార్ హీరో డూప్ కి కూడా ఇవ్వాల్సి వస్తోంది. అంతేకాదు హీరోకి ఇస్తున్న కంఫర్ట్స్, ఫెసిలిటీస్ కూడా ఆఫర్ చెయ్యాల్సి వస్తోంది. ఎందుకంటే హీరో డూప్ కి ఆరోగ్యం బాగాలేకపోయినా, ఏదైనా సమస్యతో షూటింగ్ కి రాకపోతే షెడ్యూల్ క్యాన్సిల్ చెయ్యాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఈ రెమ్యునరేషన్ ప్రొడ్యూసర్స్ కి అదనపు భారంగా మారుతోంది.