వరుణ్ తేజ్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన నాగబాబు

వరుణ్ తేజ్ పెళ్లి..క్లారిటీ ఇచ్చిన నాగబాబు

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్లి కొడుకు కాబోతున్నాడు. త్వరలో వరుణ్ తేజ్ వివాహం చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని మెగ్రా బ్రదర్ నాగబాబు కన్ఫర్మ్ చేశారు. 

త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి ఉంటుంది..ఈ విషయాన్ని వరుణ్ వెల్లడిస్తాడు. అమ్మాయి ఎవరు..? అనేది కూడా వరుణ్ తేజే చెప్తాడు.. అని నాగబాబు తెలిపారు. పెళ్లి తర్వాత వరుణ్ తేజ్ వేరే ఇంట్లో ఉంటాడని..ఎందుకంటే తన బిడ్డలకు ప్రైవసీ ఇవ్వడం అలవాటు అని నాగబాబు చెప్పుకొచ్చారు. వేర్వేరు ఇళ్లల్లో ఉన్నా తమ మధ్య సంబంధాలు ఎప్పుడూ బలంగానే ఉంటాయన్నారు. వరుణ్ తేజ్ వివాహంపై నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. 

వరుణ్‌ తేజ్‌ మ్యారేజ్పై గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు షికారు చేశాయి. వీరిద్దరు మిస్టర్‌, అంతరిక్షం 9000kmph  సినిమాల్లో కలిసి నటించారు. ఈ సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడ్డారని..రిలేషన్లో ఉన్నారని ..తొందరలోనే పెళ్లి చేసుకుంటారని కూడా వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వరుణ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి స్పందించలేదు. అయితే పెళ్లి కూతురు ఎవరనే విషయాన్ని నాగబాబు స్పష్టం చేయకపోవడంతో సోషల్ మీడియాలో వచ్చిన వార్తలే నిజమని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. లావణ్య త్రిపాఠే వరుణ్ తేజ్కు కాబోయే వైఫ్ అని అనుకుంటున్నారు. 

చిరంజీవి అతిథి పాత్రలో నాగబాబు, బ్రహ్మానందం లీడ్ రోల్లో నటించిన హ్యాండ్సప్ సినిమాలో బాల నటుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన వరుణ్ తేజ్..శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుందా మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో కంచె సినిమాతో హిట్ కొట్టాడు. లోఫర్, మిస్టర్ సినిమాలు చేసినా అవి బాక్సాఫీజ్ వద్ద బోల్తా కొట్టాయి. అనంతరం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన  ఫిదా తో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. ఆ తర్వాత తొలిప్రేమ సినిమాతో మరో హిట్టు సాధించాడు. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అంతరిక్షం 9000 KMPHతో నటుడిగా ఓ మెట్టు ఎక్కాడు. ఇక 2019లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన F2 మూవీతో మరో బ్లాక్ బస్టర్‌  అందుకున్నాడు. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేసిన  గద్దలకొండ గణేష్ తో పర్వాలేదనిపించాడు. గతేడాది గని మూవీతో డిజాస్టర్ అందుకున్న వరుణ్ తేజ్....F3 మూవీతో మంచి సక్సెస్ సాధించాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్.. గాండీవధారి అర్జున మూవీ చేస్తున్నాడు.