బాలయ్క నెక్ట్స్ మూవీకి ముహూర్తం రెడీ

V6 Velugu Posted on Jan 26, 2022

‘అఖండ’తో బ్లాక్‌‌‌‌‌‌‌‌బస్టర్  అందుకున్న బాలకృష్ణ.. ‘అన్‌‌స్టాపబుల్‌‌‌‌‌‌‌‌’ అంటూ ఓటీటీ షోతోనూ సత్తా చాటుతున్నారు. అలాగే  నెక్స్ట్‌‌‌‌‌‌‌‌  ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌పైనా  ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం ఆయన లైనప్‌‌‌‌‌‌‌‌లో వరుస సినిమాలు ఉన్నాయి. వీటిలో ముందుగా గోపీచంద్ మలినేని రూపొందించనున్న మూవీ సెట్స్‌‌‌‌‌‌‌‌కి వెళ్లనుంది. ఈపాటికే షూట్ స్టార్ట్ చేయాల్సి ఉన్నా కరోనా కేసులు పెరగడంతో కాస్త ఆలస్యమైంది.  వచ్చే నెల 12న ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్‌‌‌‌‌‌‌‌ను మొదలుపెట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. భారీ యాక్షన్ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌తో   రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్  ప్రారంభిస్తారట.

తర్వాత ప్రకాశం, కడప జిల్లాల్లోని లొకేషన్స్‌‌‌‌‌‌‌‌లో షూట్ చేయనున్నారు. రియల్‌‌‌‌‌‌‌‌ ఇన్సిడెంట్స్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా రాయలసీమ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో స్టోరీ రెడీ చేశాడు గోపీచంద్. ఈ మూవీకి ‘వేటపాలెం’ అనే టైటిల్‌‌‌‌‌‌‌‌ పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. శ్రుతీహాసన్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో విలన్‌‌‌‌‌‌‌‌గా  కన్నడ నటుడు  దునియా విజయ్, కీలకపాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Tagged Telugu, tollywood, Nandamuri Balakrishna, next movie, Cinemas, balayya, upcoming movie

Latest Videos

Subscribe Now

More News