
టెరిఫిక్ ప్రియాంక:
బాలీవుడ్ సినిమాలు తగ్గించి, హాలీవుడ్‌లో సెటిలవడానికి సిద్ధమైన ప్రియాంకా చోప్రా.. అక్కడ ఆల్రెడీ కొన్ని సినిమాల్లో నటించింది. త్వరలో మరో మూవీతో రాబోతోంది. హాలీ వుడ్ భారీ యాక్షన్ ఫ్రాంచైజీ ‘మ్యాట్రిక్స్’ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీలో కీలక పాత్ర పోషిస్తోంది ప్రియాంక. ‘ద మ్యాట్రిక్స్ రిజరెక్షన్స్ రీ సెంటర్ 12.2.21’ పేరుతో రూపొం దుతున్న ఈ మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ నిన్న రిలీజైంది. యాక్షన్ లేడీ గెటప్‌లో టెరిఫిక్‌గా ఉంది ప్రియాంక.
మోడ్రన్ అనసూయ:
రీసెంట్‌గా ‘పుష్ప’ మూవీలోని దాక్షాయణి లుక్‌తో వచ్చిన అనసూయ.. ఇప్పుడు తన నెక్స్ట్ మూవీ ప్రీ లుక్‌ను రిలీజ్ చేసింది. లైబ్రరీలో పుస్తకాల ర్యాక్స్ మధ్యలో నిలబడి ఏదో చదివేస్తోందామె. ముఖం కనిపించలేదు కానీ.. లేత గులాబీరంగు ఫ్రాక్, షార్ట్ హెయిర్‌తో మోడర్న్‌గా ఉంది. ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు చెప్పింది. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయశంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నట్టు, అనసూయ ఎయిర్ హోస్టెస్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం.
జయమ్మ పంచాయతీ పాట:
చాలా గ్యాప్ తర్వాత సుమ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘జయమ్మ పంచాయితీ’. దేవీ ప్రసాద్, దినేష్, షాలిని ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కలివారపు విజయ్ కుమార్ దర్శకుడు. బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ కోసం కీరవాణి ట్యూన్ చేసిన ‘తిప్పగలనా’ పాటను నిన్న నాని చేతుల మీదుగా లాంచ్ చేశారు. రామాంజనేయులు రాసిన ఈ పాటను రోహిత్ పాడాడు. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించ నున్నట్టు మేకర్స్ చెప్పారు.