
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ గ్రామాన్ని ఆయన దత్తత తీసుకోనున్నారు. ఇటీవల ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 లాంటి పాత్ బ్రేకింగ్ చిత్రాలతో అభిషేక్ మంచి విజయాలను అందుకున్నారు. అయితే ఆయన సినిమాలతో పాటు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలతో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
అభిషేక్ కోవిడ్19 సమయంలో చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇప్పుడు మరొక అడుగు ముందుకేశారు. గత రెండు బ్లాక్‌బస్టర్ సినిమాలతో మంచి లాభాలను ఆర్జించిన ఈ యువ నిర్మాత తిమ్మాపూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని.. అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నారు. తన తండ్రి తేజ్ నారాయణ్ అగర్వాల్ పుట్టిన రోజు సందర్భంగా గ్రామాన్ని దత్తత తీసుకోనున్నారు.