
టాలీవుడ్ నటుడు... మాజీ ఎమ్మెల్యే .. విలన్ పాత్రలో సినీ ప్రేక్షకులను రంజింన చేసిన కోట శ్రీనివాసరావు ఈ రోజు ( జులై 13) ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు అస్తమించారు. మహాప్రస్థానంలో ఆయనఅంత్యక్రియలు ఈరోజు ( జులై 13) మధ్యాహ్నం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కోట శ్రీనివాసరావు అంత్యక్రియలు మహా ప్రస్థానంలోనే అంత్యక్రియలు జరగనున్నాయి. జులై 13 మధ్యాహ్నం 12:30 గంటలకు కోట శ్రీనివాసరావు అంతిమయాత్ర ప్రారంభం కానుందని.. 3 గంటల సమయంలో... మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరుగుతాయని చెబుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులు మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నారని తెలుస్తోంది.
గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు... ఇవాళ ఉదయం మృతి చెందారు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే.. కోట శ్రీనివాసరావు మృతి చెందిన నేపథ్యంలో.. అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తున్నారు.