పడిపోయిన టమాట రేటు

పడిపోయిన టమాట రేటు

దేశంలో మూడేళ్ల కనిష్ఠానికి ధర
బోయిన్‌పల్లిలో కిలో రూ.5
ఏడాది కిందట ఇక్కడే రూ. 34
మార్కెట్‌కు పంట ఎక్కువ వస్తున్నందుకే..

హైదరాబాద్, వెలుగు: టమాట ధర అమాంతం పడిపోయింది. దేశవ్యాప్తంగా మూడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు హోల్‌ సేల్‌ మార్కెట్లలో ప్రస్తుతం కిలో టమాట రూ. 3 నుంచి రూ. 10 వరకే పలుకుతోంది. కనీసం పెట్టుబడి కూడా రాకున్నా ఇంకో దారి లేక కన్నీళ్లతోనే పంటను రైతులు అమ్ముకుపోతున్నారు.

బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలోనూ ఇంతే
సెంట్రల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ లెక్కల ప్రకారం శుక్రవారం హైదరాబాద్‌ బోయిన్‌పల్లి మార్కెట్‌లో కిలో టమాట రూ. 5 పలికింది. ఏడాది కిందట ఇదే మార్కెట్‌లో కిలో రూ.34కు కొన్నారు. ఢిల్లీ ఆజాద్‌పూర్‌ హోల్‌ సేల్ మార్కెట్‌లో గతేడాది రూ. 12 ధర పలకగా ఇప్పుడు రూ .4 కే కొంటున్నారు. బెంగళూరులో ఏడాది కిందట కిలో రూ. 30 పైనే పలికిన రేటు ఇప్పుడు రూ. 10 మాత్రమే నడుస్తోంది. మార్కెట్‌కు పంట ఎక్కువగా వస్తుండటంతో ధర తగ్గిందని అధికారులు చెబుతున్నారు.

ఉత్పత్తి ఏపీ, కర్నాటకల్లో ఎక్కువ
దేశంలో కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో టమాట ఎక్కువగా పండుతుంది. ఈ ఏడాది రెండు రాష్ట్రాల్లో ఉత్పత్తి 42 లక్షల టన్నులుగా అంచనా వేశారు. దేశంలో ఏటా 111 లక్షల టన్నుల డిమాండ్‌ ఉంటుంది. 2019–-20 పంట సంవత్సరానికి టమాట ఉత్పత్తి 193.28 లక్షల టన్నులకు పెరిగిందని ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

For More News..

బజార్న పడ్డ నేతన్న

పంటల మ్యాపింగ్‌ షురూ