మహారాష్ట్రలో టమాట ధరలు భారీగా పడిపోయాయి. కేజీ కేవలం 3 రూపాయలు మాత్రమే పలుకుతోంది. . నాసిక్, ఔరంగాబాద్ లో రోడ్డుపై టమాటా పోసి నిరసన తెలిపారు. ట్రక్కులు, లారీల్లో తెచ్చి రోడ్డుపై పారబోశారు. టమాటకు కనీస మద్దతు ధర ఇచ్చేలా సర్కార్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీసం... కూలీలకు ఇచ్చే రేటు కూడా రావటం లేదన్నారు. టమాట రైతులను సర్కార్ ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
