- ఈనెల 30 వరకూ దరఖాస్తులు
ఖమ్మం టౌన్,వెలుగు : తెలంగాణ ఓవర్సీస్ మాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్) ద్వారా జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి యన్. మాధవి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.తెలంగాణ రాష్ట్రానికి చెందిన నర్సింగ్ అభ్యర్థులకు విదేశీ ఉద్యోగావకాశాలు కల్పించడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, మొత్తం 90 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు.ఏప్రిల్ 30 లోపు దరఖాస్తులు అందజేయాలని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు జూలై 8 నుండి 17 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.
