ఇది దోమలనే కాదు.. ఎగిరే కీటకాలు అన్నింటినీ ఎట్రాక్ట్ చేసి, చంపుతుంది. లోపలి భాగంలో రెండు హై ఇంటెన్సిటీ అల్ట్రా వైలట్ ట్యూబ్స్ ఉంటాయి. బయటివైపు పవర్ఫుల్ హై వోల్టేజ్ మెటల్ గ్రిడ్‌తో ఉంటుంది. చనిపోయిన దోమలు, కీటకాలు కింది భాగంలో ఉన్న ఒక ట్రేలో పడతాయి. ఇది క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ. దాదాపు 500 చదరపు మీటర్ల వరకు దీని ఎఫెక్ట్ ఉంటుంది.
ఇల్లు, ఆఫీస్, రెస్టారెంట్లు, స్కూళ్లు, హాస్పిటల్స్ లాంటి వాటిలో దీన్ని పెట్టుకోవచ్చు. సౌండ్ రాదు. కెమికల్స్ అవసరం లేదు. ఇంట్లో పెట్స్ ఉన్నా వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. వెల్బెర్గ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ ఇన్సెక్ట్ కిల్లర్ సంవత్సరం వారంటీతో వస్తుంది.
ధర: 3,599 రూపాయలు