టూల్స్&గాడ్జెట్స్ : వాక్యూమ్ సీలర్

టూల్స్&గాడ్జెట్స్   : వాక్యూమ్ సీలర్

సాధారణంగా నట్స్‌‌‌‌, జామ్స్‌‌‌‌ లాంటివాటిని గాజు సీసాల్లో స్టోర్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటాం. అయితే.. సీసాలను సీల్‌‌‌‌ చేసి స్టోర్‌‌‌‌‌‌‌‌ చేస్తే అవి మరింత ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి. మరి సీల్‌‌‌‌ చేయడం ఎలా అంటారా? అందుకోసం ఈ వన్ టచ్‌‌‌‌ సీలింగ్‌‌‌‌ గాడ్జెట్‌‌‌‌ ఉపయోగిస్తే సరిపోతుంది. వోత్‌‌‌‌ఫెవ్‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చిన ఈ గాడ్జెట్‌‌‌‌కి ఎల్‌‌‌‌ఈడీ స్క్రీన్‌‌‌‌ ఉంటుంది. అందులో బ్యాటరీ స్టేటస్‌‌‌‌, వ్యాక్యూమ్‌‌‌‌ సీలింగ్‌‌‌‌ టైం డిస్‌‌‌‌ప్లే అవుతుంది.  ఇది చాలా తక్కువ టైంలోనే మేసన్ జార్‌‌‌‌‌‌‌‌లను వాక్యూమ్ సీల్‌‌‌‌ చేయగలదు.

ఇందులో 1300mAh రీచార్జబుల్ బ్యాటరీ ఉంటుంది. టైప్‌‌‌‌ సీతో రీచార్జ్‌‌‌‌ చేసుకోవచ్చు. ముఖ్యంగా క్యాంపింగ్, పిక్నిక్‌‌‌‌, టూర్లకు వెళ్లినప్పుడు మిగిలిపోయిన ఫుడ్‌‌‌‌, శ్నాక్స్‌‌‌‌ని పాడవకుండా స్టోర్‌‌‌‌‌‌‌‌ చేసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మేసన్ జార్‌‌‌‌‌‌‌‌ నుంచి ఇది 40 సెకన్లలో పూర్తిగా గాలిని తొలగించగలదు. ఈ సీలర్ కిట్‌‌‌‌లో వేర్వేరు సైజుల్లో రెండు జార్ సీలర్ హెడ్‌‌‌‌లు ఉంటాయి. రెగ్యులర్ సైజ్‌‌‌‌ నుంచి వైడ్ మౌత్‌‌‌‌కి మార్చడానికి హెడ్‌‌‌‌ను తిప్పితే సరిపోతుంది. ప్యాక్‌‌‌‌లో 5 వెడల్పుగా ఉండే జార్‌‌‌‌‌‌‌‌ మూతలు, 5 సాధారణ మేసన్ జార్ మూతలు, ఒక ఓపెనర్, చార్జింగ్ కేబుల్ వస్తాయి. 2,198

యూవీ స్టెరిలైజర్ వాండ్

పిల్లలు ఆడుకునే బొమ్మలు, కొన్ని రకాల గాడ్జెట్లను నీళ్లతో కడగలేం. అలాంటి వాటి మీద ఉండే బ్యాక్టీరియాని తొలగించేందుకు ఈ యూవీ స్టెరిలైజర్‌‌‌‌‌‌‌‌ బాగా ఉపయోగపడుతుంది. దీన్ని శామ్‌‌‌‌సోన్‌‌‌‌ అనే కంపెనీ మార్కెట్‌‌‌‌లోకి తీసుకొచ్చింది. ఇది 2వాట్స్ పవర్‌‌‌‌‌‌‌‌తో పనిచేస్తుంది.

►ALSO READ | కిచెన్ తెలంగాణ : రోటి పచ్చళ్ల రుచే వేరు!

బ్యాక్టీరియాతోపాటు సూక్ష్మక్రిములు, వైరస్‌‌‌‌లను కూడా సమర్థవంతంగా నాశనం చేస్తుంది. దీనికి ఉండే ఒకే బటన్​తో ఆపరేట్​ చేయొచ్చు. ఫోన్లు, తాళం చెవులు, మాస్క్‌‌‌‌లు లాంటి వ్యక్తిగత వస్తువులను కూడా శుభ్రం చేసుకోవచ్చు. ఇది ఆటోమేటిక్‌‌‌‌గా షట్-ఆఫ్ ఫీచర్‌‌‌‌తో వస్తుంది. అంటే వాడి పక్కన పెట్టిన కాసేపటికి దానంతటదే ఆఫ్‌‌‌‌ అయిపోతుంది. 475

వైర్‌‌‌‌‌‌‌‌లెస్‌‌‌‌ చార్జింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌

డైలీ మనం వాడే ఫోన్‌‌‌‌, స్మార్ట్‌‌‌‌ వాచ్‌‌‌‌లాంటివాటికి ఒక్కోదానికి ఒక్కో చార్జింగ్​ అడాప్టర్ కొంటుంటాం.  ఎక్కడికైనా వెళ్లాలంటే వాటన్నింటినీ వెంట తీసుకెళ్లాలి. అయితే.. వాటన్నింటికీ బదులు ఈ ఒక్క అడాప్టర్‌‌‌‌‌‌‌‌ని తీసుకెళ్తే సరిపోతుంది. ఈ చార్జింగ్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ని జున్‌‌‌‌కాయ్‌‌‌‌ టెక్‌‌‌‌స్టోర్‌‌‌‌‌‌‌‌ అనే కంపెనీ తీసుకొచ్చింది. దీన్ని ప్రత్యేకంగా శామ్‌‌‌‌సంగ్ డివైజ్‌‌‌‌ల కోసం తయారుచేశారు. ఇది 27 వాట్స్‌‌‌‌కి సపోర్ట్‌‌‌‌ చేస్తుంది. ఈ చార్జింగ్ స్టేషన్‌‌‌‌కు ఒక పవర్‌‌‌‌‌‌‌‌ అడాప్టర్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది.

దాన్ని పవర్‌‌‌‌‌‌‌‌ సాకెట్‌‌‌‌లో ప్లగ్‌‌‌‌ చేసి ఒకేసారి రెండు ఫోన్లను వైర్‌‌‌‌లెస్ చార్జింగ్ చేయొచ్చు. వాటితో పాటు గెలాక్సీ వాచ్ 7/6/5/4/3/2, టీడబ్ల్యూఎస్‌‌‌‌ బాక్స్‌‌‌‌ని చార్జ్‌‌‌‌ చేసుకోవచ్చు. ఇతర ఆండ్రాయిడ్‌‌‌‌ ఫోన్లను చార్జ్‌‌‌‌ చేసుకోవడానికి యూఎస్‌‌‌‌బీ టైప్‌‌‌‌ ఏ పోర్ట్‌‌‌‌ కూడా ఉంది. ఒకేసారి 4 గాడ్జెట్స్‌‌‌‌ని చార్జ్‌‌‌‌ చేసుకోవచ్చు. ఇందులోనే వాలెట్, పర్​ఫ్యూమ్, కళ్లద్దాలు, ఫిట్‌‌‌‌నెస్ ట్రాకర్లు లాంటివి పెట్టుకోవడానికి వేర్వేరు కంపార్ట్​మెంట్లు ఉంటాయి.  ఈ వైర్‌‌‌‌లెస్ చార్జింగ్ ప్యాడ్‌‌‌‌ను అసెంబుల్ చేయడానికి స్క్రూయింగ్ అవసరం లేదు. పై ప్లేట్‌‌‌‌ను కింది ప్లేట్‌‌‌‌కి బిగిస్తే సరిపోతుంది. 15,000