ఏ బ్యాంకు ఖాతా బెటర్​ ?

ఏ బ్యాంకు ఖాతా బెటర్​ ?

న్యూఢిల్లీ: చాలా కమర్షియల్ బ్యాంకులు ఈ సంవత్సరం తమ సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను మారుస్తున్నాయి కాబట్టి సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్లను గమనించేందుకు ఇది మంచి సమయం. ఆర్బీఐ ఆదేశం ప్రకారం, సేవింగ్స్ ఖాతాపై వడ్డీని కస్టమర్ క్లోజింగ్ మొత్తం ఆధారంగా రోజువారీగా లెక్కిస్తారు. సేవింగ్స్ ఖాతా రకం లేదా  సంబంధిత బ్యాంకు రూల్స్ బట్టి  వడ్డీని ఆరు నెలలు లేదా మూడు నెలలు లేదా రోజువారీగా ఖాతాకు జమ చేస్తారు. క్వార్టర్ ప్రాతిపదికన సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై వడ్డీని జమ చేయాలని ఆర్‌‌బీఐ బ్యాంకులకు సూచించింది. స్టేట్​ బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్  ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ అందించే సేవింగ్స్ ఖాతా వడ్డీ రేట్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.

స్టేట్ బ్యాంకు

 స్టేట్ బ్యాంక్   రూ.లక్ష  అంతకంటే ఎక్కువ డిపాజిట్లపై 2.70శాతం వడ్డీ రేటును అందిస్తోంది. కొత్త రేట్లు మే 31, 2020 నుండి అమలులోకి వచ్చాయి. రూ.లక్ష,  అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌‌లు కలిగిన బ్యాంక్ డిపాజిట్ ఖాతాలపై కూడా సంవత్సరానికి 2.70శాతం వడ్డీనే ఇస్తారు.

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్  

ఈ బ్యాంకు ఫిబ్రవరి 2, 2022 నుండి కొత్త రేట్లను అమలు చేస్తోంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ రూ.50 లక్షల లోపు ఉన్న సేవింగ్స్ ఖాతాలపై 3శాతం  వడ్డీ రేటును అందిస్తోంది.   రూ.50 లక్షల కంటే ఎక్కువ – రూ.వెయ్యి కోట్ల కంటే తక్కువ మొత్తం  గల వాటిపై 3.50శాతం వడ్డీ రేటు ఉంటుంది. రూ.1,000 కోట్ల కంటే ఎక్కువ సేవింగ్స్ ఖాతాలకు 4.50 శాతం వడ్డీ అందిస్తోంది.  ఖాతాలోని రోజువారీ మొత్తాలు  మొత్తం ఆధారంగా సేవింగ్స్ ఖాతాపై వడ్డీ నిర్ణయిస్తారు. సేవింగ్స్ ఖాతాలపై మిగిలిన క్వార్టర్లో డబ్బు చెల్లిస్తారు.

ఐసీఐసీఐ బ్యాంక్  

ఐసీఐసీఐ బ్యాంక్ సేవింగ్స్ ఖాతాలపై కొత్త వడ్డీ రేట్లు జూన్ 4, 2020 నుండి అమల్లోకి వచ్చాయి. కస్టమర్‌‌లకు రూ.50 లక్షల వరకు బ్యాలెన్స్‌‌ ఉన్న ఖాతాలపై  3శాతం వడ్డీ రేటును చెల్లిస్తారు.  రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ బ్యాలెన్స్‌‌లపై సంవత్సరానికి 3.50శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తారు.

ఐడీఎఫ్​సీ ఫస్ట్ బ్యాంక్  

ప్రైవేట్ సెక్టార్​కు చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ సేవింగ్స్ ఖాతా డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది.  కొత్త రేట్లు ఫిబ్రవరి 18, 2022 నుండి అమలులోకి వచ్చాయి. బ్యాంక్ అధికారిక వెబ్‌‌సైట్ ప్రకారం, రూ.లక్ష వరకు సేవింగ్స్ ఖాతా బ్యాలెన్స్‌‌లపై 4శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  రూ.లక్ష నుంచి రూ.10 లక్షల వరకు ఉన్న సేవింగ్స్ ఖాతాలకు 4.50శాతం వడ్డీ రేటును అందిస్తోంది.