రాజ్​నాథ్​ ఇంట్లో .. ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్, బీజేపీ నేతల భేటీ

రాజ్​నాథ్​ ఇంట్లో ..  ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్, బీజేపీ నేతల భేటీ

న్యూఢిల్లీ: బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్‌‌‌‌ అగ్రనేతలు ఢిల్లీలోని రక్షణ మంత్రి రాజ్‌‌‌‌నాథ్‌‌‌‌ సింగ్‌‌‌‌ నివాసంలో భేటీ అయ్యారు. ఈ నెలాఖరులో కేరళలోని పాలక్కాడ్‌‌‌‌లో ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ సమన్వయ్ బైఠక్‌‌‌‌ జరగనున్న నేపథ్యంలో ఈ మీటింగ్​కు ప్రాధాన్యం ఏర్పడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాతో పాటు రాజ్‌‌‌‌నాథ్ సింగ్, ఆర్​ఎస్​ఎస్​ నుంచి దత్తాత్రేయ హోసబుల్, అరుణ్ కుమార్‌‌‌‌ఈ మీటింగ్​లో పాల్గొన్నారు. 

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో బంగ్లాదేశ్‌‌‌‌లోని హిందువులు, మైనారిటీల భద్రతకు భరోసా కల్పించడంతోపాటు ఈ నెలాఖరులో కేరళలోని పాలక్కాడ్‌‌‌‌లో జరగనున్న ఆర్​ఎస్​ఎస్​ సమన్వయ సమావేశం గురించి.. అలాగే, బీజేపీ సంస్థాగత ఎన్నికలకు ముందు వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌ను నియమించాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్లు బీజేపీ, ఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ఎస్ వర్గాలు తెలిపాయి. అధికారిక వర్గాలు దీనిని రొటీన్ మీటింగ్ గా పేర్కొన్నప్పటికీ.. పార్టీ, సంఘ్ మధ్య సంబంధాల నుంచి పలు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల వరకు అనేక అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దాదాపు ఐదు గంటల పాటు ఈ సమావేశం జరిగింది.