
వాషింగ్టన్: హెచ్1బీ వీసా రూల్స్‌ను డొనాల్డ్ ట్రంప్ కఠినంగా మార్చిన వేళ రెండు కంపెనీలు ఇండియన్ అమెరికన్లను టాప్ పోస్టుల్లో నియమించాయి. అమెరికా దిగ్గజ టెలికాం సంస్థ టీ మొబైల్లో ప్రస్తుతం సీఏవోగా పనిచేస్తున్న శ్రీనివాస్ గోపాలన్ (55)ను కంపెనీ సీఈఓగా ప్రమోట్ చేసింది. నవంబర్ 1న శ్రీనివాస్ బాధ్యతలు చేపడతారు. ఐఐఎం అహ్మదాబాద్ అల్యూమ్నస్ అయిన శ్రీనివాస్.. హిందుస్తాన్ యూనిలీవర్లో మేనేజ్ మెంట్ ట్రైనీగా తన కెరీర్ ప్రారంభించారు.
ఎయిర్ టెల్, వొడా, క్యాపిటల్ వన్ వంటి కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. అలాగే, మరో ఇండియన్ అమెరికన్ రాహుల్ గోయల్ (49) ను చికాగోకు చెందిన బేవరేజ్ కంపెనీ మోల్సోన్ కూర్స్ కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా నియమించింది. వచ్చే నెల 1న రాహుల్ ఆ బాధ్యతలు చేపడతారు. రాహుల్ మైసూరులో ఇంజినీరింగ్ పూర్తిచేసి అమెరికా వెళ్లారు.