
జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలకు తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని సోపోర్‌లో ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. సోపోర్ సమీపంలోని వార్పోరాలో లష్కరే ఈ తైబాకు చెందిన కమాండర్‌తోపాటు పలువురు ఉగ్రవాదులు ఓ ఇంట్లో ఉన్నారనే సమాచారంతో గురువారం రాత్రి స్థానిక పోలీసులు, భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. బలగాల రాకను గమనించిన టెర్రరిస్టులు.. కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ఫయాజ్ వార్ అనే టాప్ కమాండర్‌తో పాటు మరో టెర్రరిస్ట్ హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతమంతా కంట్రోల్‌లోనే ఉన్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.