గుంతలమయంగా కడెం ప్రాజెక్టు రోడ్డు

గుంతలమయంగా కడెం ప్రాజెక్టు రోడ్డు

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి గేట్ల వరకు వెళ్లాలంటే పర్యాటకులకు చాలా ఇబ్బందికరంగా మారింది.  ప్రాజెక్టుపైన రోడ్డు గుంతలు పడి సంవత్సరాలు గడుస్తున్నా, అధికారులు నాయకులు గుంతల రోడ్డులోనే వెళుతున్నారు.  కానీ ఆ గుంతలకు తాత్కాలిక మరమ్మతులు గానీ,  సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం లేదు.  

కడెం ప్రాజెక్టు వద్దకు రోజూ ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వర్షాకాలంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఇప్పటికైనా గుంతలు పూడ్చాలని, మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.