ఎన్టీఆర్ డ్రాగన్ లో టోవినో థామస్ కన్ఫర్మ్

ఎన్టీఆర్  డ్రాగన్ లో టోవినో థామస్ కన్ఫర్మ్

ఓటీటీలో వచ్చిన మలయాళ డబ్బింగ్ చిత్రాలతో తెలుగులోనూ మంచి గుర్తింపును అందుకున్నాడు టోవినో థామస్. తర్వాత తను నటించిన చిత్రాలు ఇక్కడ రిలీజ్ చేసి మంచి ఆదరణ దక్కించుకున్నాడు. తాజాగా తను ఓ స్ట్రయిట్ మూవీతో  టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘డ్రాగన్’ చిత్రంలో టోవినో నటించబోతున్నట్టు ఇప్పటికే ప్రచారం జరగగా, రీసెంట్‌‌గా పృథ్వీరాజ్ సుకుమారన్ క్లారిటీ ఇచ్చాడు. 

ఈ చిత్రంలో తనతోపాటు టోవినో థామస్, బీజు మీనన్‌‌లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నట్టు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు పృథ్వీరాజ్. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ  షూటింగ్ జరుగుతోంది.  మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌‌పై కళ్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.  వచ్చే ఏడాది జూన్ 25న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల కానుంది.