
మలయాళంలో రీసెంట్ గా రిలీజై ఇండస్ట్రీ హిట్గా నిలిచిన సినిమా "2018". మలయాళ స్టార్ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రాస్పాన్స్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది ఈ సినిమా. ఇక కేరళలో ఈ సినిమాకు వచ్చిన రేస్పాన్స్ చూసి.. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.
మే 26న తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటీవ్ టాక్ వస్తోంది. చూసిన ప్రతీ ఒక్కరు సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరీ ముఖ్యంగా దర్శకుడు సెకండాఫ్ ను నడిపించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కనురేప్పేవేయడానికి కూడా వీల్లేకుండా ప్రేక్షకుడిన కూర్చేబెట్టేలా కథనాన్ని నడిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుంటోంది. దీంతో ఈ సినిమా తెలుగులో కూడా భారీ విజయం సాధించడం ఖాయం అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ రేంజ్ లో పాజిటీవ్ టాక్ తెచ్చుకున్న సినిమా ఇదే కావడం విశేషం.
ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ సినిమాలు ఎం లేకపోవడం కూడా ఈ సినిమాకు పాజిటీవ్ గా మారే అవకాశం ఉంది. కాబట్టి సినిమాకు తెలుగులో కూడా మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల నుండి వినిపిస్తున్న మాట. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.