
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: సింగరేణి కాలరీస్కొత్తగూడెం ఏరియాలోని పీవీకే--–5 ఇంక్లైన్లో విషవాయువులు వెలువడడంతో కార్మికులు కొంత ఆందోళనకు గురయ్యారు. అండర్‌గ్రౌండ్ మైన్‌లో 73 లెవల్ ప్రాంతంలో మంగళవారం బొగ్గు మండి విషవాయువులు కొంత మేర వెలువడ్డాయి. బుధవారం కూడా విషవాయువులు వెలువడడంతో కార్మికులు ఆందోళన చెందారు.
అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలో రక్షణ చర్యలు తీసుకున్నారు. విష వాయువులు లీక్‌అవుతున్న విషయాన్ని ఓవర్మెన్గుర్తించి వెంటనే తమ దృష్టికి తీసుకువచ్చారని మైన్మేనేజర్శ్యాంప్రసాద్తెలిపారు. పాత మైన్లలో ఇలాంటివి సాధారణమని, ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.