
జీడిమెట్ల, వెలుగు: జీడిమెట్ల ఇండస్ట్రియల్ఏరియాలోని ఓ కంపెనీ నుంచి విషవాయువులు వెలువడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫేజ్-1లోని సుప్రభాత్ ల్యాబోరేటరీస్‌లో ఉన్న ట్యాంక్ నుంచి శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా ఘాటైన వాయువులు బయటకు వెలువడ్డాయి. దీంతో ఆ దారి గుండా వెళ్లే ప్రయాణికులు, స్థానికులు శ్వాస తీసుకోవడం, కండ్ల మంటలతో ఇబ్బందులు పడ్డారు. కాసేపటికి విషవాయువులు ఆగిపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.