
కొల్లాపూర్, వెలుగు: పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ఎంప్లాయిస్ జేఏసీ డివిజన్ చైర్మన్ జీకే వెంకటేశ్ కోరారు. ఆదివారం కొల్లాపూర్ ఎంపీడీవో ఆఫీస్ ఎదుట ఆందోళనలకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు.
సోమవారం నాగర్కర్నూల్ కలెక్టరేట్ ఎదుట జరిగే ఆందోళనకు ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్, కార్మికులు, పెన్షనర్లు పాల్గొనాలని కోరారు. ఎంపీడీవో భాస్కర్, ఎంఈవో ఇమాన్యుయేల్, శంకర్, కృష్ణ ప్రసాద్, వరప్రసాద్, వెంకటేశ్వర్లు, రాములు, నాగరాజు, కురుమయ్య, రబ్బానీ పాల్గొన్నారు.