
కోస్గి, వెలుగు: పట్టణంలోని శివాజీ చౌక్ లో ఛత్రపతి శివాజీ గణేశ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకుడిని ఆదివారం నిమజ్జనం చేశారు. ఇందులోభాగంగా లడ్డూ వేలం నిర్వహించగా, ఉత్సవ సమితి సభ్యులు రూ.12.51 లక్షలకు దక్కించుకున్నారు.నిమజ్జనంలో యూపీ నుంచి వచ్చిన కళాకారులు అఘోర వేశధారణలో ఆకట్టుకున్నారు. నిర్వాహకులు కోడిగింటి హరికుమార్, భాస్కర్, ప్రవీణ్, మల్లేశ్, నాగరాజ్ పాల్గొన్నారు.