రైతులకు యూరియా అందించాలి : మల్లేశ్ గౌడ్

రైతులకు యూరియా అందించాలి :  మల్లేశ్ గౌడ్

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం రైతులకు యూరియా అందించాలని బీసీ సంక్షేమ శాఖ జిల్లా వర్కింగ్  ప్రెసిడెంట్  మల్లేశ్ గౌడ్  డిమాండ్  చేశారు. ఆదివారం పట్టణంలో బీసీ సంక్షేమ సంఘం మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు వరి, పత్తి, మొక్కజొన్న పంటలు ఏపుగా పెరిగాయని, పంటలకు ప్రస్తుతం యూరియా అవసరం ఉందన్నారు. గత ఏడాది కంటే ఎక్కువగా పంటలు సాగు చేశారని చెప్పారు. 

రైతులు యూరియా కోసం ఉదయం నుంచి క్యూలో నిలబడాల్సి వస్తుందని పేర్కొన్నారు. బ్లాక్  మార్కెట్ కు తరలిస్తున్న, అధిక ధరలకు అమ్ముతున్న వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. నిరంజన్, సుధాకర్, శ్రీనివాసులు, రవీందర్  పాల్గొన్నారు.