
వంగూరు, వెలుగు: వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని జాజాల, కోనాపూర్, తండాలకు వెళ్లే రోడ్డు పూర్తిగా దెబ్బతినడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. విద్యార్థులు బడికి వెళ్లలేని పరిస్థితి లేకపోవడంతో, ఆదివారం ఈ విషయాన్ని అచ్చంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు క్యామ మల్లయ్యకు తెలియజేశారు.
వెంటనే స్పందించిన ఆయన తండాలో ఐమాక్స్ లైట్లను ఏర్పాటు చేయడంతో పాటు 50 ట్రిప్పుల మొరం పోయించి జేసీబీతో రోడ్లకు రిపేర్లు చేయించారు. క్యామ మల్లయ్యకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, తండావాసులు పాల్గొన్నారు.