టయోటా ఎబెల్లా ఈ3తో  543 కిలోమీటర్ల మైలేజ్‌‌‌‌

టయోటా ఎబెల్లా ఈ3తో  543 కిలోమీటర్ల మైలేజ్‌‌‌‌

ఈ ఏడాది జనవరిలో  గ్లోబల్‌‌గా లాంచ్ అయిన టయోటా ఎలక్ట్రిక్ వెహికల్ ఎబెల్లా,  ఇండియాకూ వచ్చింది.  టాప్ ఎండ్‌‌  ఈ3 వేరియంట్‌‌  ధర రూ.23.60 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) ఉంది. ఈ1, ఈ2 వేరియంట్ ధరలను ఇంకా ప్రకటించలేదు.  మారుతి సుజుకి 'ఈ –విటారా' ఆధారంగా ఈ3 ని రీబ్యాడ్జ్ చేశారు. 

ఈ– విటారా ధర రూ.20 లక్షలు. ఎబెల్లా ఈ3లో 61కిలోవాట్‌‌అవర్‌‌ (కేడబ్ల్యూహెచ్‌‌)‌‌ బ్యాటరీ ఉండగా, ఒకే ఛార్జ్‌‌పై 543 కిమీ మైలేజ్ (రేంజ్) ఇస్తుంది. బేస్ వేరియంట్ ఈ1 49 కిలోవాట్ల బ్యాటరీ, 440 కిమీ రేంజ్‌‌తో వస్తోంది. ఈ కారును బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (అద్దె విధానం)  విధానంలోనూ కొనొచ్చు. దీనికి 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ, 60శాతం బైబ్యాక్ అష్యూరెన్స్ లభిస్తాయి.