కీలక పదవులన్నీ బీహారీల చేతుల్లోనే

కీలక పదవులన్నీ బీహారీల చేతుల్లోనే

రాష్ట్రంలో ఐఏఎస్,ఐపీఎస్ ల పోస్టింగ్ ల పై అభ్యంతరాలు  వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.తెలంగాణ అభివృద్ధి చెందుతుందని మెథావి వర్గం పరిపాలన లో భాగస్వామి అవుతుందని ఆశించామని..కానీ ఎనిమిదేళ్లుగా ఇంకా పరాయి పాలనలోనే మగ్గుతున్నామన్నారు.కీలక మైన శాఖలు బీహార్ అధికారుల చేతుల్లోనే ఉన్నాయన్నారు. సీఎం కేసీఆర్ చుట్టూ ఉన్న వాళ్లు,అధికారులు బీహారిలే అన్నారు రేవంత్ రెడ్డి.ఉద్యమంలో కీలకంగా పనిచేసిన  అధికారులు నిరాదరణకు గురవుతున్నారన్నారు.రాష్ట్రంలో 157ఐఏఎస్,139మంది ఐపీఎస్ లు ఉండగా బీహార్ అధికారులను అందలం ఎక్కించడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ కు టీపీసీసీ చీఫ్ రేవంత్  రెడ్డి లేఖ రాశారు. డీజీపీ పదవులు కూడా బీహారి అధికారులకే  ఇచ్చారని ఆరోపించారు.బీహార్ అధికారులకు పదుల సంఖ్యలో శాఖలు కేటాయించారని..జయేష్ రంజన్ సారథ్యంలో టీఏస్ ఐఐసీ ద్వారా జరిగిన భూ కేటాయింపుల పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం

రాజధాని అవసరాలకు తప్ప వేరే వాటికి భూములు ఇవ్వొద్దు

నన్ను చూసి చంద్రుడే ఈర్ష్యపడతాడు