రేపు మునుగోడులో కాంగ్రెస్ కార్యక్రమానికి రేవంత్

రేపు మునుగోడులో కాంగ్రెస్  కార్యక్రమానికి రేవంత్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కరోనా నుంచి కోలుకున్నారు. రేపు మునుగోడులో కాంగ్రెస్ గ్రామ గ్రామాన జెండా కార్యక్రమం ఉండగా..దీనికి రేవంత్ హాజయ్యే అవకాశం ఉంది. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు చేపట్టేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. రాజీవ్ జయంతి సందర్భంగా ఏడు మండలాలు, 175 గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ ర్యాలీలు.. గ్రామం నడిబొడ్డున పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ప్రతి గ్రామంలో ఒక ముఖ్య నేత పాల్గొనేలా కార్యక్రమ రూపకల్పన చేశారు. ప్రతి ఇంటికి పండ్ల బుట్ట పంపిణీతో పాటు ప్రతి ఇంటికి మన మునుగోడు మన కాంగ్రెస్ పేరుతో స్టిక్కర్లు, కరపత్రాలు అందించేలా ఏర్పాట్లు చేశారు. 

కాంగ్రెస్ లోగో విడుదల చేసిన రేవంత్ రెడ్డి

మునుగోడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ లోగోను విడుదల చేసింది. “మన మునుగోడు - మన కాంగ్రెస్..హస్తం గుర్తుకే మన ఓటు అన్న స్లోగన్ తో ఒక వైపు సోనియాగాంధీ, మరోవైపు రాహుల్ గాంధీ ఫోటోలతో ఈ లోగోను రూపొందించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  ఈ లోగోను ఆవిష్కరించారు. కాంగ్రెస్ శ్రేణులు మునుగోడు నియోజకవర్గంలో ప్రతి ఇంటి డోర్ మీద కాంగ్రెస్ లోగో ఉండేలా చూడాలని రేవంత్ సూచించారు.