ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాడాలి

ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాడాలి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పటిష్టంగా ఉండాలని, ప్రతి కోర్టు పరిధిలోనూ పార్టీ వ్యవస్థ ఏర్పాటు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ తరపున పోరాటాలు చేసే సమయాల్లో వారికి న్యాయవాదులు (కాంగ్రెస్ లీగల్ టీం) అండగా ఉండాలని సూచించారు. నాయకులు ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తున్నప్పుడు పాలకులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తుంటారని, ఆ సమయాల్లో గట్టిగా ఎదుర్కోవాలని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సమావేశం చైర్మన్ దామోదర్ రెడ్డి అధ్యక్షతన గాంధీభవన్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్ చార్జ్ మాణికం ఠాగూర్, ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, చిన్నారెడ్డి హాజరయ్యారు. 

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో న్యాయస్థానాల పరిధిలో ఉండే పదవులు ఇప్పుడు కష్టపడ్డ వాళ్లకు లభిస్తాయని రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కష్టపడితే పదవులు వాటంతట అవే వస్తాయన్నారు. ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటి వరకూ చాలా కేసుల్లో కాంగ్రెస్ లీగల్ టీమ్ బాగా పని చేసిందని, ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో మరింత గట్టిగా పని చేయాలని రేవంత్ రెడ్డి కోరారు.