
ముషీరాబాద్,వెలుగు: తెలంగాణ కాంగ్రెస్ లో ఆంధ్ర నాయకుల పెత్తనం ఎక్కువైందని, అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేశ్ ముదిరాజ్ తెలిపారు. ఆదివారం రాంనగర్ లోని తన ఇంట్లో మీడియా సమావేశంలో పార్టీకి రాజీనామా చేసిన లేఖను ఆయన విడుదల చేసి మాట్లాడారు.
పార్టీలో 35 ఏళ్లుగా పని చేస్తున్నప్పటికీ బీసీలకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు లేని వారికి స్థానం లేదని, డబ్బులకు ఎమ్మెల్యే సీట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.
తనకు గుర్తింపు లేకనే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులతో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.