కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి : టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్

కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి : టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్

ఎల్బీనగర్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిపై నిరాధార, అవినీతి ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేత కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్​రెడ్డి వనస్థలిపురం పీఎస్​లో  బుధవారం ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ మూసీ ప్రక్షాళన విషయంలో కుంభకోణం జరిగిందని కేటీఆర్​ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే అధారాలు చూపాలని డిమాండ్ చేశారు. మంత్రిగా పని చేసిన కేటీఆర్​కు ప్రభుత్వ నిధులు ఎలా కేటాయిస్తారో తెలియదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మూసీ పేరిట చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.