భారత్ జోడో యాత్రకు మద్దతు తెలపండి

భారత్ జోడో యాత్రకు మద్దతు తెలపండి
  • పీపీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: మోడీ, కేసీఆర్  బ్రిటీషోళ్ల శిష్యులని పీపీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి అన్నారు. ఆదివారం బోయిన్‌‌‌‌‌‌‌‌పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్‌‌‌‌‌‌‌‌లో గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి మాట్లాడారు. దేశంలో విద్వేషాలు రెచ్చగొట్టి అధికారంలో కొనసాగాలని కేసీఆర్, మోడీ చూస్తున్నారని విమర్శించారు. వారి కుట్రలను తిప్పికొట్టడానికి గాంధేయవాదులంతా ఏకం కావాలన్నారు. దేశాన్ని బీజేపీ కబలించాలని చూస్తోందని, చవకబారు నేతల విభజించు, పాలించు విధానాలను తిప్పికొట్టేందుకే రాహుల్ గాంధీ భారత్​ జోడో యాత్ర చేస్తున్నారని చెప్పారు. గాంధీ స్ఫూర్తితో  తెలంగాణ ప్రజలంతా యాత్రకు మద్దతు తెలపాలని కోరారు.

దండి యాత్ర, క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై అనే నినాదంతో పోరాటం చేసి గాంధీజీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారని, ఆయన స్ఫూర్తితోనే నెహ్రూ హరిత విప్లవం తీసుకొచ్చారన్నారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావ్, వినోద్ రెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.