రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు: టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్

రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు:  టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శంకర్

షాద్ నగర్, వెలుగు:  సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ మండిపడ్డారు. ఆదివారం షాద్ నగర్ టౌన్ లో పారిశు ద్ధ్య కార్మికుల సమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తానని మాయ మాటలు చెప్పి గద్దెనెక్కిన తర్వాత కేసీఆర్ హామీలను మర్చిపోయారని విమర్శించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, చాలీచాలని జీతాలతో బతుకులు వెళ్లదీస్తున్నారని, వేతనాలు పెంచాలని సమ్మె చేస్తున్నా వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పంచాయతీ కార్మికులకు సరైన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం సమ్మెలో పాల్గొన్న కార్మికులకు రూ. 10 వేల ఆర్థికసాయం అందించారు. 

పీసీసీ మెంబర్ బాబర్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఎంపీటీసీలు కొమ్ము కృష్ణ, కుమార్ గౌడ్,మైనార్టీ సెల్ హలీం, తుపాకుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.