రాజన్నసిరిసిల్ల,వెలుగు: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభ పాపం గత ప్రభుత్వానిదేనని, దానికి మాజీ మంత్రి కేటీఆర్ బాధ్యత వహించాలని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిది కటకం మృత్యుంజయం అన్నారు. ఆదివారం సిరిసిల్ల డీసీసీ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్య కష్టమైంది కాదని, కొందరు కావాలనే దీనిని జఠిలం చేస్తున్నారన్నారు.
పరిశ్రమలను ప్రారంభించాలని యజమానులను కోరామన్నారు. గత ప్రభుత్వం వస్ర్త పరిశ్రమలకు ఇవ్వాల్సిన బకాయిలు పెండింగ్‌లో పెట్టిందని ఆరోపించారు. కొంతమంది నాయకులు సిరిసిల్ల నేతన్నలను ఉసిగొల్పి ధర్నాలు చేయిస్తున్నారన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్ ఉన్నారు.