
తొర్రూరు, వెలుగు: కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిని బుధవారం టీపీసీసీ ఉపాధ్యక్షురాలు, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లో మంత్రిని కలిసి నూతంగా బాధ్యతలు స్వీకరించినందుకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
ఝాన్సీరెడ్డి మాట్లాడుతూ రాజకీయ, సాంఘిక సేవలలో వివేక్ కు కలిగిన అనుభవం రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.