వీహెచ్ తో వార్… నగేష్ అవుట్?

వీహెచ్ తో వార్… నగేష్ అవుట్?

కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి. హనుమంతరావు తో దురుసుగా ప్రవర్తించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నగేష్ ముదిరాజ్  పై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. ఇందుకుగాను క్రమశిక్షణా సంఘం అత్యవసరంగా సమావేశమైంది. చైర్మన్ కోదండ రెడ్డితో పాటు పాల్గొన్న సభ్యులు… ఇందిరాపార్క్ వద్ద జరిగిన అఖిల పక్ష సమావేశంలో విహెచ్ పై నగేష్ ప్రవర్తించిన తీరు భౌతిక ధాడిగా గుర్తిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు నగేష్ పై క్రమశిక్షణా చర్యలు తప్పక తీసుకుంటామని తెలిపారు.

విహెచ్ పై దాడి జరిగినపుడు.. అక్కడే ఉన్న పొన్నం ప్రభాకర్, మండలి విపక్ష మాజీ నేత షబ్బీర్ అలీ లను దాడిపై నివేదిక ఇవ్వమని కుంతియా సూచించారు. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం తో పాటు.. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా నగేష్ ముదిరాజ్ పైన చర్యలు తీసుకునెందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలిపారు.