ఖర్గేను కలిసిన మహేష్ కుమార్ గౌడ్..టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ

ఖర్గేను కలిసిన మహేష్ కుమార్ గౌడ్..టీపీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చ

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల అవసరం ఎంతుందో..యువతరం అవసరం కూడా అంతే ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేను ఆయన కలిశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ ఒక్కటై రాజకీయ నాటకాలు చేస్తున్న తీరును ఖర్గేకు వివరించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న కార్యవర్గ కూర్పు గురించి చర్చించినట్లు చెప్పారు.

అనుభవంతో పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యల్ని ఖర్గే పరిష్కరిస్తారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు ఎదుర్కోబోతున్నామని..ఎక్కువ మందికి కార్యవర్గంలో అవకాశం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. టీకాంగ్రెస్ నేతలు చెప్పేవన్నీ ఖర్గే వింటున్నారని.. ఆయనకు రాష్ట్రంపై పూర్తి అవగాహన ఉందన్నారు. వీటిన్నింటిపై ఆచితూచి సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు స్పష్టం చేశారు.