కాగజ్ నగర్ మండలంలో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కాగజ్ నగర్ మండలంలో ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

కాగజ్ నగర్, వెలుగు: కాగజ్ నగర్ మండలం జగన్నాథ్ పూర్ ప్రాజెక్ట్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 3 ట్రాక్టర్లను అధికారులు పట్టుకున్నారు. మైనింగ్ ఏడీ నాగరాజు, రెవెన్యూ ఇన్​స్పెక్టర్ ఖాలిక్ అహ్మద్, ఇరిగేషన్ అధికారుల ఆకస్మిక తనిఖీలు చేసి ఈ మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు. అనంతరం వీటిని సేఫ్ కస్టడీ కోసం కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. నిబంధనలకు  విరుద్ధంగా పర్మిషన్ లేకుండా ఇసుక తరలిస్తే వాహనాలకు ఫైన్ వేస్తామని, మళ్లీ రిపీట్ చేస్తే సీజ్ చేస్తామని హెచ్చరించారు