ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం...రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన

ట్రాక్టర్ బోల్తా పడి యువకుడు దుర్మరణం...రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
  • ఎల్లారెడ్డిపేట మండలంలో అదుపుతప్పిన ట్రాక్టర్​ 

ఎల్లారెడ్డిపేట, వెలుగు: పొలం దున్నేందుకు వెళ్తుండగా ట్రాక్టర్  అదుపుతప్పి పల్టీ కొట్టడంతో డ్రైవర్  చనిపోయాడు. ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్  గ్రామానికి చెందిన గడ్డం జితేందర్(34 ) అదే గ్రామానికి చెందిన వ్యక్తి ట్రాక్టర్ పై డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 

గురువారం పొలం దున్నేందుకు కేజీ వీల్స్ ను ట్రాక్టర్  నాగండ్లకు తగిలించుకొని వెళ్తున్నాడు. గ్రామ శివారులోని స్పీడ్  బ్రేకర్  వద్ద ట్రాక్టర్​ జంప్​ కావడంతో కేజీ వీల్స్​ ఇరువైపులా పడిపోయి ట్రాక్టర్  ఒక్కసారిగా అదుపు తప్పి పల్టీ కొట్టింది. డ్రైవర్  సీట్ లో ఇరుక్కున్న జితేందర్​ అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.