తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

తిరుమలలో తప్పిన పెను ప్రమాదం

తిరుమల తిరుపతిలో భారీ ప్రమాదం తప్పింది. ఈ రోజు ఉదయం (ఫిబ్రవరి 21)న ఉదయం 8 గంటలకు ఎస్వీ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఉన్న గేటును వేగంగా ఓ ట్రాక్టర్ వచ్చి ఢీకొంది. డ్రైవర్ బ్రేక్ కు బదులుగా యాక్సిలరేటర్ తొక్కాడు. దీంతో ఒక్కసారిగా ట్రాక్టర్ ముందున్న గేట్ ను  స్పీడ్ గా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో గేట్ దగ్గర ఎక్కువ మంది భక్తులు లేకపోవడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ వారిని తిరుమలలో అశ్వని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.