కోల్బెల్ట్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ఆపాలని, నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సాయంత్రం మందమర్రిలో కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. సింగరేణి కార్మిక సంఘాల జేఏసీ యూనియన్లు ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీబీజీకేఎస్, సీఐటీయూ ఆధ్వర్యంలో సింగరేణి జీఎం ఆఫీస్ఎదుట ధర్నా చేశారు. అనంతరం లీడర్లు మాట్లాడుతూ.. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని, కొత్తగా ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే సింగరేణి వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మందమర్రి ఏరియా సింగరేణి ఏస్వోటుజీఎం లలితేంద్రప్రసాద్కు వినతిపత్రం అందజేశారు. లీడర్లు ఎండీ అక్బర్అలీ, సత్యనారాయణ, మల్లేశ్, సుదర్శనం, దేవి భూమయ్య, సమ్మయ్య, నరేందర్, భిక్షపతి, వెంకటస్వామి, రామస్వామి, సంపత్, రాజశేఖర్తదితరులు పాల్గొన్నారు.
