సెబీ ఎంత హెచ్చరించినా.. చిన్న ట్రేడర్లు ఆప్షన్స్ వైపే

సెబీ ఎంత హెచ్చరించినా.. చిన్న ట్రేడర్లు ఆప్షన్స్ వైపే
  • కిందటి నెలలో 575 కోట్లకు చేరిన ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ డెరివేటివ్‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌ల వాల్యూమ్స్‌‌‌‌ 
  • ఇందులో 564 కోట్లు ఇండెక్స్‌‌‌‌ ఆప్షన్స్‌‌‌‌వే..

న్యూఢిల్లీ: నిపుణులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా, 99 శాతం మంది ట్రేడర్లకు నష్టాలొస్తున్నాయని సెబీ, ఎక్చేంజిలు చెబుతున్నా,  రిటైల్ ట్రేడర్లు మాత్రం ఆప్షన్స్‌‌‌‌ ట్రేడింగ్‌‌‌‌ను వదిలిపెట్టడం లేదు.  మే నెలలో నిఫ్టీ, బ్యాంక్‌‌‌‌ నిఫ్టీ ఆప్షన్స్ ట్రేడింగ్ వాల్యూమ్స్ రికార్డ్‌‌‌‌ లెవెల్‌‌‌‌ అయిన 564 కోట్ల కాంట్రాక్ట్‌‌‌‌లకు చేరుకున్నాయి.  కిందటి నెలలో నిఫ్టీ బ్యాంక్ కొత్త ఆల్‌‌‌‌ టైమ్ గరిష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాది మేలో  ఆప్షన్ ట్రేడింగ్‌‌‌‌లో (ఇండెక్స్‌‌‌‌, స్టాక్)575 కోట్ల కాంట్రాక్ట్‌‌‌‌లు ట్రేడయ్యాయి. ఇందులో 98 శాతం వాటా ఇండెక్స్ ఆప్షన్స్‌‌‌‌దే ఉంది.  ప్రొప్రైటరీ ట్రేడర్లు, ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లు  ఆప్షన్స్‌‌‌‌లో భారీగా డబ్బులు పెట్టారు. ఆప్షన్ ట్రేడింగ్ వాల్యూమ్స్ పెరుగుతుండడంతో సెబీ కూడా అనుభవం లేని రిటైల్ ఇన్వెస్టర్లను హెచ్చరించడానికి కొత్త మార్గాలు వెతుకుతోంది. ఆప్షన్స్, ఫ్యూచర్స్ ట్రేడింగ్‌‌‌‌లో ఎక్కువ మందికి నష్టాలే వస్తున్నాయనే విషయాన్ని తెలియజేసేలా తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌లో డిస్‌‌‌‌ప్లే చేయాలని బ్రోకర్లను ఆదేశించింది. ఫ్యూచర్స్‌‌‌‌, ఆప్షన్స్‌‌‌‌ (డెరివేటివ్స్‌‌‌‌) ట్రేడింగ్ చేస్తున్న  ప్రతీ  10 మందిలో తొమ్మిది మందికి   నష్టాలొస్తున్నాయని ,  ట్రేడర్ సగటున రూ.50 వేలు నష్టపోతున్నాడనే విషయాలను డిస్‌‌‌‌క్లోజ్ చేయడం వంటి చర్యలను సెబీ తీసుకుంది.

ఎందుకంత ఆసక్తంటే..?

ఫ్యూచర్స్‌‌‌‌తో పోలిస్తే ఆప్షన్స్‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌లు చౌకగా ఉంటాయి. ఉదాహరణకు జూన్ 29 ఎక్స్‌‌‌‌పైరీ గల   నిఫ్టీ 18,600 ఫ్యూచర్‌‌‌‌‌‌‌‌ కాంట్రాక్ట్‌‌‌‌ను కొనడానికి రూ. లక్షల మార్జిన్ ఉండాలి. అదే  18,600 కాల్‌‌‌‌ ఆప్షన్‌‌‌‌ను రూ.9 వేలకే పొందొచ్చు.  కానీ, ఆప్షన్స్ వాల్యూ రోజులు కరిగే కొద్దీ తగ్గిపోతుంది.   ట్రాన్సాక్షన్‌‌‌‌ ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ట్రేడర్లకు మరింత నష్టం వస్తుంది.  ఎన్‌‌‌‌ఎస్‌‌‌‌ఈ ఏప్రిల్ డేటా చూస్తే, మొత్తం జరిగిన ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్‌‌‌‌ టర్నోవర్‌‌‌‌‌‌‌‌లో  56.2 శాతం వాటా ప్రో ట్రేడర్లది ఉండగా, 26.9 శాతం వాటా ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్లది ఉంది.  కాగా,  ఈ ఏడాది  ఏప్రిల్‌‌‌‌లో 442.29 కోట్ల డెరివేటివ్  కాంట్రాక్ట్‌‌‌‌లు ట్రేడయ్యాయి. ఇందులో  433.97 కోట్లు ఇండెక్స్‌‌‌‌ ఆప్షన్స్ కాంట్రాక్ట్‌‌‌‌లు ఉన్నాయి. అదే కిందటేడాది మే నెలలో 261 కోట్ల కాంట్రాక్ట్‌‌‌‌లు ట్రేడవ్వగా, వీటిలో 250.61 కోట్ల ఇండెక్స్ ఆప్షన్స్‌‌‌‌ ఉన్నాయి.