అంబర్‌పేట బోనాలు.. ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు

అంబర్‌పేట బోనాలు.. ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు

అంబర్‌పేట మహంకాళి ఆలయంలో 2023  జులై 16 నుంచి 18 వరకు బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి.  ఈ క్రమంలో నగర పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు జారీ చేశారు. జూలై 16 ఉదయం 6 గంటల నుండి జూలై 18 ఉదయం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయి.  

ఈ రూట్లలో ట్రాఫిక్‌ ఆంక్షలు

ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే అన్ని జిల్లాల బస్సులు, సిటీ బస్సులు, భారీ వాహనాలు హబ్సిగూడ - తార్నాక - అడిక్‌మెట్ - విద్యా నగర్ - ఫీవర్ హాస్పిటల్ - టివై మండలి - టూరిస్ట్ హోటల్ జంక్షన్ మీదుగా ఉప్పల్ ఎక్స్ రోడ్డు వద్దకు  మళ్లించబడతాయి.  

కోటి నుంచి ఉప్పల్ వైపు వచ్చే భారీ వాహనాలు, సిటీ బస్సులను నింబోలి అడ్డ-టూరిస్ట్ హోటల్-టీవై మండలి- ఫీవర్ హాస్పిటల్- అడిక్‌మెట్-తార్నాక -హబ్సిగూడ -ఉప్పల్ ఎక్స్ రోడ్ల మీదుగా మళ్లిస్తారు.

ఉప్పల్ నుంచి అంబర్‌పేట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను రాయల్ జ్యూస్ కార్నర్ - మల్లికార్జున నగర్ - డిడి కాలనీ - సిండికేట్ బ్యాంక్ - శివం రోడ్డు వద్ద మళ్లిస్తారు.